తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నో అనుమానాలు: కేటీఆర్

By Siva KodatiFirst Published Nov 21, 2020, 8:01 PM IST
Highlights

ఆరేళ్ల కిందట తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నో అనుమానాలు వుండేవన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బాలానగర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. 

ఆరేళ్ల కిందట తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నో అనుమానాలు వుండేవన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బాలానగర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆరేళ్లలో హైదరాబాద్ ఎంత మందుకు వెళ్లిందో ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. బాలానగర్ చౌరస్తాలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవరే అభివృద్ధికి నిదర్శమని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఏమవుతుందోనని అనుమానాలు వుండేవన్నారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ఎన్నో ఫ్లైఓవర్లు, కొత్త లింక్ రోడ్లు వచ్చాయని కేటీఆర్ చెప్పారు.

నగరంలో వరద బాధితులకు రూ.10వేలు ఇస్తుంటే మోకాలు అడ్డుపెట్టింది ఎవరు? అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.  

అర్హులైన వారందరికీ వరద సాయం అందజేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో మనం సెంచరీ కోల్పోయాం. ఈసారి జీహెచ్‌ఎంసీ  ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ పార్టీ శతకం పూర్తి చేయాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. ప్రశాంతమైన హైదరాబాద్‌ కోసం టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ కోసం పనిచేసే వారిని తిరిగి కార్పొరేషన్‌కు పంపించాలని కేటీఆర్‌ కోరారు.  
 

click me!