‘‘కేసీఆర్ గంగారెడ్డి’’ మనవరాలి పెళ్లికి హాజరైన కవిత

Siva Kodati |  
Published : Dec 09, 2020, 04:58 PM IST
‘‘కేసీఆర్ గంగారెడ్డి’’ మనవరాలి పెళ్లికి హాజరైన కవిత

సారాంశం

తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమితంగా అభిమానిస్తూ, తన ఇంటి పేరునే కేసీఆర్ గా మార్చుకున్న టీఆర్ఎస్ కార్యకర్త గంగారెడ్డి కుటుంబంలో వివాహానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమితంగా అభిమానిస్తూ, తన ఇంటి పేరునే కేసీఆర్ గా మార్చుకున్న టీఆర్ఎస్ కార్యకర్త గంగారెడ్డి కుటుంబంలో వివాహానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత.  

 

 

మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ‘కేసీఆర్ గంగారెడ్డి’ మనవరాలు వేద శ్రీ (దివ్య భారతి) - అనంత రెడ్డి ల వివాహానికి హాజరైన కవిత, నూతన వధూవరులను ఆశీర్వదించారు.  

టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ వెంట నడుస్తున్న గంగారెడ్డి, తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో 2006, 2011 లో రెండు సార్లు సీఎం కేసీఆర్ జగ్గాసాగర్ లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు.

 

 

తమ గ్రామంలో కేసీఆర్ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించే గంగారెడ్డి, చుట్టు పక్కల గ్రామాల్లో సైతం ‘కేసీఆర్ గంగారెడ్డి’ గానే సుపరిచితుడు. తమ మనవరాలి వివాహానికి, కేసీఆర్ కుమార్తె, కవిత హాజరవడం పట్ల గంగారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu