కరోనా వ్యాక్సిన్: 64 మంది విదేశీ ప్రతినిధులతో భారత్ బయోటెక్ ఛైర్మెన్ భేటీ

By narsimha lodeFirst Published Dec 9, 2020, 3:45 PM IST
Highlights

: కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మెన్ కృష్ణ ఎల్లా బుధవారం నాడు 64 దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మెన్ కృష్ణ ఎల్లా బుధవారం నాడు 64 దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

కరోనా వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు గాను భారత్ బయోటెక్ ను 64 దేశాల ప్రతినిధి బృందం ఇవాళ సందర్శించింది. రెండు బృందాలుగా ఈ బృందం సభ్యులు విడిపోయారు. ఒక్క బృందం భారత్ బయోటెక్ ను మరో బృందం బయోలాజికల్ ఈ సెంటర్ ను పరిశీలించింది.

also read:భారత్ బయోటెక్‌: కరోనా వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించనున్న 64 దేశాల ప్రతినిధులు

విదేశీ ప్రతినిధి బృందంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మధ్యాహ్న భోజనం చేశారు.విదేశీ బృందానికి  భారత్ బయోటెక్  ఛైర్మెన్ కృష్ణ  పలు అంశాలను వివరించారు.భారత్ లో కోవాగ్జిన్ టీకా వివరాలతో పాటు భారత్ బయోటెక్ సంస్థ చరిత్రను కృష్ణ విదేశీ బృందానికి వివరించారు.

పలు విదేశీ సంస్థలతో భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తోందని కృష్ణ వివరించారు. గత నెల 28వ తేదీన భారత్ బయోటెక్ సంస్థను భారత ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీని ఆయన పరిశీలించారు.


 

click me!