మాజీ మంత్రి ఈటల రాజేందర్ హత్యా రాజకీయాలు చేస్తారని రుజువైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్పారు.మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో ఘర్షణను ఆయన ప్రస్తావించారు.హుజూరాబాద్ హత్యా రాజకీయాలను మునుగోడులో చూపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్:మాజీ మంత్రి ఈటల రాజేందర్ హత్యా రాజకీయాలు చేస్తారని రుజువైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ హత్య రాజకీయాలను మునుగోడు కు తేవాలని ఈటెల ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
.మునుగోడు లో ఎక్కడా గొడవలు జరగలేదన్నారు.
ఈటెల అత్త గారి ఊర్లోనే ఎందుకు గొడవలు జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని చంపాలని ఈటల రాజేందర్ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.ఈటెల రాజేందర్ నేర చరిత్ర హుజురాబాద్ ప్రజలకు తెలుసునన్నారు.. ఈటల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.. వందల కోట్లతో మునుగోడు ప్రజలను బీజేపీ మభ్యపెట్టాలని చూసిందని ఆయన ఆరోపించారు.
ఈటల రాజేంందర్ విజయం సాధించి ఏడాదైందన్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.తానే టీ ఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈటల రాజేందర్ అమలు చేయలేదన్నారు.కేసీఆర్ మునుగోడు లో దించిన బుల్లెట్ కు బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యిందని ఆయన ఆరోపించారు.బీజేపీ నేతలు కేసీఆర్ గురించి మాట్లాడితే హైద్రాబాద్ నుంచి ఉరికిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.వివేక్ తన తండ్రి వెంకట స్వామి ఇజ్జత్ తీస్తున్నారన్నారు.కేటీఆర్ కాలిగోటికి కూడా వివేక్ సరిపోరన్నారు.
మునుగోడులో వచ్చిన ఫలితంతో బీజేపీ నేతలకు మతి పోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకాానంద చెప్పారు. ఈసీ ని అడ్డం పెట్టుకుని తమను ఓడించాలని బీజేపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.తమకు మునుగోడు లో 17వేల మెజారటీ వచ్చిందన్నారు..కారును పోలిన గుర్తు వల్ల 7 వేల ఓట్లు కోల్పోయామన్నారు.బీజేపీ కి తెలంగాణ లో స్థానం లేదని తేలిపోయిందని ఆయన చెప్పారు.
వామ పక్షాలతో పొత్తు కుట్ర ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీలతో తాము బహిరంగంగానే పొత్తు కుదుర్చుకున్నామన్నారు.మునుగోడులో టీ ఆర్ ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా లేదా చెప్పాలన్నారు.లగడపాటి రాజగోపాల్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కటే అనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.బీజేపీ దిగజారిన రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పిచ్చి మాటలుమానుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ లో ఉంటే ఆయన మరో ఏడాదిలో ఎంపీ అయ్యేవారన్నారు.