నాగంకు ఉస్మానియాలో పట్టిన గతే గాంధీభవన్ లో పడుతుంది : కర్నె ప్రభాకర్

First Published Jul 4, 2018, 4:04 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై చేసినవన్నీ అసత్యపు ఆరోపణలేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. నాగం ఇలాగే అనాలోచితంగా మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీలో పట్టిన గతే పడుతుందని సూచించారు. ఆయన అబద్దాల రెడ్డి గా పేరుతెచ్చుకుంటున్నారని కర్నె విమర్శించారు.

గాంధీభవన్ కూర్చుని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ...ఆ పార్టీనే అవినీతి పార్టీగా పేర్కొనడాన్ని కర్నె గుర్తుచేశారు. ఇలా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తల చేతిలోనే అదే గాంధీభవన్ నాగంకు దేహశుద్ది జరగడం ఖాయమని అన్నారు. అలా జరక్కుండా చూసుకోవాలని నాగం కు సూచించారు.

నాగం కు ఏ పార్టీలో ఉంటే ఆ భజన చేస్తారని కర్నె అన్నారు. అలా చేయడంలో తమకేమీ అభ్యంతరం లేదని కానీ తమ నాయకులను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఆయన నిన్న కేసీఆర్, హరిష్ లపై చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు కర్నె పేర్కొన్నారు.

బిజెపి నుండి కాంగ్రెస్ లోకి నాగం చేరడంవల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఏం లేదని అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి భారమేనన్న విషయం త్వరలోనే తెలుస్తుందన్నారు. టిడిపిలో ఉన్నపుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని తిట్టి ఇప్పుడు పొగడటం ఆయన రెండు నాలుకల దోరణికి అద్దం పడుతోందని కర్నె ప్రభాకర్ విమర్శించారు.    

click me!