ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయున్న టీఆర్ఎస్ నేతలు

By Nagaraju TFirst Published Dec 13, 2018, 10:52 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడంతో ఇద్దరు ఎమ్మెల్సీలు తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్ రెడ్డిలు కొనసాగుతున్నారు. 

 హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడంతో ఇద్దరు ఎమ్మెల్సీలు తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్ రెడ్డిలు కొనసాగుతున్నారు. 

అయితే ముందస్తు ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అటు పట్నం నరేందర్ రెడ్డి సైతం కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించి పట్నం నరేందర్ రెడ్డి రికార్డు సృష్టించారు. 

ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. మరికాసేపట్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు వీరు తమ రాజీనామాను అందజేయనున్నారు. 
 

click me!