మంచులో దారి కనిపించక....సంగారెడ్డిలో కర్ణాటక బస్ బోల్తా

sivanagaprasad kodati |  
Published : Dec 13, 2018, 10:25 AM IST
మంచులో దారి కనిపించక....సంగారెడ్డిలో కర్ణాటక బస్ బోల్తా

సారాంశం

సంగారెడ్డి జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కర్ణాటకలోని ఔరాద్ డిపోకు చెందిన బస్సుకు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడకల్‌లో నైట్ హాల్ట్ ఉంది.

సంగారెడ్డి జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కర్ణాటకలోని ఔరాద్ డిపోకు చెందిన బస్సుకు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడకల్‌లో నైట్ హాల్ట్ ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 25 మంది ప్రయాణికులతో తడకల్ నుంచి ఔరాద్‌కు బయలుదేరింది.

ఉదయాన్నే దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో కంగ్టి సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదానికి గురయ్యామని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu