కేటీఆర్ ను సీఎం చేయాల్సిందే: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్

Published : Jan 20, 2021, 11:18 AM IST
కేటీఆర్ ను సీఎం చేయాల్సిందే: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్

సారాంశం

కేటీఆర్ ను తెలంగాణ సీఎం చేయాలనే డిమాండ్ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ ను కోరారు.

హైదరాబాద్: తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావును తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను సీఎం చేయాలని గత కొంత కాలంగా కొంత మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ డిమాండ్ చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ను  కోరారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్థుడని, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని షకీల్ అన్నారు. యువనేత కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తనతో పాటు మరింత మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఆశీర్వదించాలని ఆయన అన్నారు. 

కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి అన్నారు. తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అదే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఆలోచించి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు | IPS VC Sajjanar Warning | Asianet News Telugu
సీఎం రేవంత్ రెడ్డి ఫిట్ నెస్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే | CM Revanth Reddy Playing Football