కొత్తబట్టలు పెట్టి ఇంటికి భూమి పూజ... అనాధ ఆడబిడ్డలకు మేనమామలా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 01, 2021, 03:37 PM ISTUpdated : Jul 01, 2021, 03:40 PM IST
కొత్తబట్టలు పెట్టి ఇంటికి భూమి పూజ... అనాధ ఆడబిడ్డలకు మేనమామలా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

సారాంశం

నిలువ నీడ లేక కొన్నాళ్లుగా టెంట్ కిందే జీవిస్తున్న అనాధ ఆడపిల్లలను చూసి చలించిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ వారికి మేనమామలా మారి అండగా నిలిచారు. 

కరీంనగర్: తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన ఇద్దరు చిన్నారులకు  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అండగా నిలిచారు. నిలువ నీడ లేక కొన్నాళ్లుగా టెంట్ కిందే జీవిస్తున్న ఆడపిల్లలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే వారికి మేనమామలా మారారు. ఇళ్లు కట్టుకోడానికి సాయం చేయడమే కాదు ఇవాళ(గురువారం) జరిగిన భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మాయిలకు కొత్తబట్టలు పెట్టారు. స్వయంగే తానే ముగ్గుపోసి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు.   

వివరాల్లోకి వెళితే... చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన సమత, మమతల తల్లిదండ్రులు చనిపోవడంతో ఆడపిల్లలిద్దరూ అనాథలుగా మారారు. సంవత్సరం క్రితం తల్లిదండ్రులు చనిపోగా ఉండడానికి ఇళ్లు లేకపోవడంతో టెంటు కిందే నివాసం ఉన్నారు. ఈ విషయం వివిధ పత్రికలలో, వార్త ఛానలల్లో, సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ స్పందించారు. తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేసి, దాతలు ముందుకు రావాలని కోరారు.

వీడియో

ఎమ్మెల్యే పిలుపుతో స్పందించిన దాతలు, ఎన్నారైలు తమ వంతు సహాయం చేశారు. దీంతో మొత్తం రూ.15 లక్షల రూపాయలు దాతల నుండి అందాయి. ఈ డబ్బును పిల్లల అకౌంట్లో జమ చేయడం జరిగింది. సంవత్సరం తర్వాత ప్రస్తుతం వారు ఇల్లు కట్టుకోవడానికి అమ్మాయిలిద్దరి చేత రవిశంకర్ భూమి పూజ చేయించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లి ఇద్దరికీ మేనమామలా మారి బట్టలు పెట్టారు. గతంలో దసరా పండుగ సందర్భంగా కూడా ఆ పిల్లలకు బట్టలు పెట్టడంతో పాటు వారితో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే రవిశంకర్. 

ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి అమ్మాయిలిద్దరికీ రవిశంకర్ అన్ని తానే అయి చూసుకుంటున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి కూడా తానే చేయిస్తానని తెలిపారు. అన్ని తానై పిల్లలకు భరోసా ఇవ్వడం పట్ల ప్రజలు ఎమ్మెల్యే రవిశంకర్ ను అభినందిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్