సాంస్కృతిక సారథి ఛైర్మన్ పదవి మళ్లీ రసమయికే... కేసీఆర్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Jul 14, 2021, 10:04 AM IST
Highlights

తెలంగాణ కళాకారుల కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక సారథి సంస్థ ఛైర్మన్ గా మరోసారి నియమితులయ్యారు టీఆర్ఎస్ మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. 

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కళాకారుల కోసం కేసీఆర్ సర్కార్ తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థను ఏర్పాటుచేసింది. 2015 చివర్లో ఈ సంస్థ ఛైర్మన్ గా స్వతహాగా కళాకారుడయిన మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగియగా తిరిగి సాంస్కృతిక సారథి సంస్థ చైర్మన్ గా పునర్నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవీలో బాలకిషన్ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

హైకోర్టులో కేసుల కారణంగా కొంతకాలం సాంస్కృతిక సారథి సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇటీవల అవి పరిష్కారం కావడంతో తాజాగా ఆ సంస్థ ఛైర్మన్ గా తిరిగి బాలకిషన్ ను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 

read more  జగన్ బాటలో కేసీఆర్: ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్, కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం

తనను సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన వెంటనే రసమయి ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తనకు మరోసారి అవకాశమిచ్చిన కేసీఆర్ కు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చేతులమీదుగానే ఎమ్మెల్యే రసమయి నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలోనే కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న  రసమయిని సీఎం కేసీఆర్ అభినందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేయడంలో సాంస్కృతిక సారథి కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్‌ సూచించారు.
 

click me!