టీఆర్ఎస్ లో ఇంటిదొంగలున్నారట

By Nagaraju TFirst Published Dec 31, 2018, 11:04 AM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీలో ఇంటిదొంగలున్నారంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటిదొంగలకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. 

జనగామ: టీఆర్ఎస్ పార్టీలో ఇంటిదొంగలున్నారంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటిదొంగలకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. 

త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటి దొంగలకు చెక్‌ పెట్టి, అసెంబ్లీ ఎన్ని కల్లో విధేయులుగా పనిచేసిన వారికే పంచాయితీ టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించి పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు. 

నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మహిళలకు 50శాతం రిజర్వేషన్‌లు ఉన్నందున ఎన్నికల్లో తన గెలుపుకోసం క్రియాశీలక పాత్ర పోషించిన మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. తన గెలుపుకోసం ధైర్యంగా పనిచేసిన వారు నేరుగా తనకు టికెట్‌ కావాలని అడిగే హక్కు ఉందన్నారు. గ్రామాల వారిగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు జనవరి 6వ తేదీ వరకు ఓటరు నమోదుపై దృష్టి సారించాలని అన్నారు.  

click me!