ఆరు నెలలు అధికారం అప్పగిస్తాం... ఆ పని చేయగలరా?: బిజెపి, కాంగ్రెస్ లకు మాజీ మంత్రి సవాల్

Arun Kumar P   | Asianet News
Published : Sep 05, 2021, 08:22 AM ISTUpdated : Sep 05, 2021, 08:42 AM IST
ఆరు నెలలు అధికారం అప్పగిస్తాం... ఆ పని చేయగలరా?: బిజెపి, కాంగ్రెస్ లకు మాజీ మంత్రి సవాల్

సారాంశం

దళిత బంధు వంటి పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా వున్న ఎస్సీలతో పాటు ఎస్టి,బిసి,మైనారిటీ,ఓసీలకు ఏకకాలంలో అందజేస్తామంటే ఆరునెలల పాటు రాష్ట్రంలో అధికారాన్ని అప్పగిస్తామని ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. 

జడ్చర్ల: దళిత బంధుపై విమర్శలు చేస్తున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపిలకు ఆరునెలల పాటు తెలంగాణలో అధికారం అప్పగిస్తాం... రాష్ట్రంలోని దళితులందరికి ఒకేసారి దళిత బంధు ఇస్తారా? అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. ఏకకాలంలో పాటు బిసి, ఎస్టీ, మైనారిటీ, ఓసీ లకు దళిత బంధు వంటి పథకాన్నిఅందించడంతో పాటు ఇంటింటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా? అది సాధ్యమేనా? అని మాజీ మంత్రి ప్రతిపక్షాలను నిలదీశారు. 

మీ హైకమాండ్ ల నుండి ఇంటింటికీ ఉద్యోగం, అన్ని వర్గాలకు ఏకకాలంలో దళిత బంధు అందిస్తామని తీర్మానించిన లెటర్ తీసుకురండి...  ఆరునెలల పాటు మీకు అధికారాన్ని అప్పగిస్తామని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు సూచించారు. ఈ సవాల్ ను స్వీకరించడానికి సిద్దమేనా? అని ప్రతిపక్షాలను లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.  

read more  టీఆర్ఎస్‌ను వీడేది లేదు.. పార్టీ మార్పుపై తేల్చేసిన తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ సామాజికవర్గ ప్రజల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్ లో బిసి, ఎస్టీ,మైనారిటీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తారన్న నమ్మకం వుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజికంగానే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆదుకుంటారని మాజీ మంత్రి తెలిపారు. 

దళిత బంధు వంటి మంచి పథకాన్ని కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే తీసుకువచ్చారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. కేవలం దళితులకే ఎందుకీ పథకం... ఇతర వర్గాల్లో పేదలులేరా? కేవలం హుజురాబాద్ లోనే ఎందుకు? రాష్ట్రమంతా ఎందుకు అమలుచేయరు? అంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని ప్రతిపక్షాలకు సూచించారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.  

PREV
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu