టీఆర్ఎస్‌ను వీడేది లేదు.. పార్టీ మార్పుపై తేల్చేసిన తుమ్మల నాగేశ్వరరావు

Siva Kodati |  
Published : Sep 04, 2021, 09:41 PM ISTUpdated : Sep 04, 2021, 09:44 PM IST
టీఆర్ఎస్‌ను వీడేది లేదు.. పార్టీ మార్పుపై తేల్చేసిన తుమ్మల నాగేశ్వరరావు

సారాంశం

తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.  టీఆర్ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని  కార్యకర్తలను తుమ్మల కోరారు

తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శనివారం కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వానికి మద్ధతు ఇద్దామని పిలుపునిచ్చారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని  కార్యకర్తలను తుమ్మల కోరారు. టీఆర్ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాగా, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన రహస్యంగా చర్చలు జరిపినట్లుగా  గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తుమ్మల తాను టీఆర్ఎస్‌ను వీడటం లేదని స్పష్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ