మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమితో ఈడీ, ఐటీ దాడులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద

By narsimha lodeFirst Published Nov 23, 2022, 2:17 PM IST
Highlights

మునుగోడు  ఉప  ఎన్నికల్లో  ఓటమితో  కక్షతో  ఈడీ, ఐటీ  సంస్థల దాడులు చేస్తుందని  టీఆర్ఎస్  ఎమ్మెల్యే  వివేకానంద  చెప్పారు. 

హైదరాబాద్:మునుగోడు  ఉప  ఎన్నికల్లో  ఓటమితో ఈడీ, ఐటీ సంస్థల  దాడులతో తన  కక్షను  బీజేపీ బయటపెట్టుకుంటుందని  టీఆర్ఎస్  ఎమ్మెల్యే  వివేకానంద  విమర్శించారు.  బుధవారంనాడు  హైద్రాబాద్ లోని టీఆర్ఎస్  శాసనసభపక్ష  కార్యాలయంలో  ఆయన  మీడియాతో  మాట్లాడారు. 8 ఏళ్ల  బీజేపీ పాలనలో  పేదరికం,  నిరుద్యోగం,  విపరీతంగా పెరిగిందని  ఆయన  చెప్పారు. .బీజేపీ రాష్ట్ర  కార్యవర్గ సమావేశం తెలంగాణ కు ఉపయోగపడే ఏ ఒక్క అంశాన్ని చర్చించలేదన్నారు.  కేంద్రం నుంచి రావాల్సిన నిధుల పై ఎలాంటి చర్చ జరగలేదని  చెప్పారు. .తెలంగాణపై  విషం చిమ్మడం తప్ప  ఎలాంటి  విషయాలపై  బీజేపీ చర్చించలేదన్నారు.  మోడీ హైద్రాబాద్ కు వచ్చి ఆట మొదలైంది అన్నట్టుగా మాట్లాడారన్నారు. .బండి సంజయ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని  ఆయన  విమర్శించారు.

సీబీఐ,  ఈడీ ,ఐటీ  సంస్థలను   బీజేపీ  తన జేబు సంస్థలుగా మార్చుకుందని  ఆయన  విమర్శించారు. బీజేపీ  తన జేబు  సంస్థలతో  యుద్ధం  చేస్తుందని ఆయన  ఆరోపించారు.  ఈడీ, ఐటీ  దాడుల్లో  నియామకాలకు  తిలోదకాలు  ఇచ్చారన్నారు. బీజేపీకి పోయే కాలం  దాపురించిందని  చెప్పారు. .ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అడ్డంగా దొరికి పోయిందన్నారు.  బీజేపీ  రెడ్  హ్యాండెడ్గ్  గా  దొరికిపోవడమేనా  దేశం  కోసం  ధర్మం  కోసమా  అని  బండి  సంజయ్ ను  టీఆర్ఎస్  ఎమ్మెల్యే  వివేకానంద  ప్రశ్నించారు. పదవులను  తృణ ప్రాయంగా  వదిలేసి  ఉప  ఎన్నికలు  తెచ్చిన ఘనత  టీఆర్ఎస్ దేనని  ఆయన  తెలిపారు. కానీ, తన  స్వార్ధం  కోసం  బీజేపీ  ఉప ఎన్నికను  తెచ్చిందన్నారు.ఆర్ఎస్ఎస్‌లో  ఉన్నంత  మాత్రాన  చేసిన  తప్పులు  ఒప్పులు  అవుతాయా  అని ప్రశ్నంచారు  ఎమ్మెల్యే  వివేకానంద.

also read:మొబైల్‌ను ఎందుకు దాచిపెట్టారు: మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

గతంలో  ఆరోపణలు  వచ్చిన సమయంలో  రాం మాధవ్ ను  ఆర్ఎస్ఎస్ పకక్కన  పెట్టిందని ఆయన  గుర్తు  చేశారు. సిట్  విచారణకు  బీఎల్  సంంతోష్  హాజరైతే  అన్ని  విషయాలు  బయటకు  వస్తాయన్నారు. చట్టమంటే  గౌరవం  ఉందో  లేదో  చెప్పాలన్నారు. సీఎంగా  ఉన్న  షమయంలో  మోడీ  ఎనిమిది గంటల పాటు  విచారణకు  హాజరైన  విషయాన్ని ఆయన  గుర్తు చేశారు. కానీ  సిట్  విచారణకు  బీఎల్  సంతోష్  ఎందుకు  హాజరు కావడం లేదో  చెప్పాలన్నారు. 

తెలంగాణకు  పెట్టుబడులు  రావడం  లేదని  బండి సంజయ్  తప్పుడు  ప్రచారం చేస్తున్నారని  వివేకానంద  మండిపడ్డారు. తెలంగాణ కు ప్రతి రోజూ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.మంత్రి మల్లా రెడ్డి నివాసాల పై ఐటీ దాడుల కోసం రోజూ 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని  విమర్శించారు. ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం అయినందుకే  ఈడీ,ఐటీ  దాడులకు  బీజేపీ పురిగొల్పిందన్నారు

click me!