కరోనా పరీక్షలపై బీజేపీ తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Published : Jun 23, 2020, 12:03 PM IST
కరోనా పరీక్షలపై బీజేపీ తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

సారాంశం

కరోనా పరీక్షల విషయమై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. 

హైదరాబాద్: కరోనా పరీక్షల విషయమై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. 

మంగళవారం నాడు హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 60 వేల కరోనా టెస్టులు నిర్వహించినట్టుగా జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కరోనా టెస్టులపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడ రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.దేశంలో కరోనా కేసులు నమోదౌతున్న సమయంలో  నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు.

also read:తెలంగాణలో బీజేపీ దూకుడు: టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేనా?

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన మిషన్లను బెంగాల్ రాష్ట్రానికి తరలించింది కేంద్ర ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు.

బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ఇలా చేసిందని ఆయన మండిపడ్డారు.రూ. 20 లక్షల ప్యాకేజీలో రైతులకు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేకుండా బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారన్నారు.తెలంగాణపై జేపీ నడ్డా తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?