నేడు, రేపు తెలంగాణలో వర్షాలు

Arun Kumar P   | Asianet News
Published : Jun 23, 2020, 11:44 AM ISTUpdated : Jun 23, 2020, 11:51 AM IST
నేడు, రేపు తెలంగాణలో వర్షాలు

సారాంశం

ఇవాళ, రేపు(మంగళ, బుధవారాల్లో) తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

హైదరాబాద్: ఇవాళ, రేపు(మంగళ, బుధవారాల్లో) తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న(సోమవారం) మాదిరిగినే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి కేరళను తాకాయి. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగానే రుతుపవనాల్లో త్వరితమైన కదలికలు ఏర్పడి కేరళను తాకేలా చేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి తెలుగురాష్ట్రాల్లోనూ విస్తరించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు పంటలు వేసుకుంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం