రేవంత్ రెడ్డి కేడీ నెంబర్ 1779: జీవన్ రెడ్డి విమర్శ

By narsimha lodeFirst Published Jun 30, 2021, 2:16 PM IST
Highlights

 పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేడీ నెంబర్ 1779 అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. 
 

హైదరాబాద్: పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేడీ నెంబర్ 1779 అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.రేవంత్ రెడ్డి ఆరు నెలలకు ఒక (పార్టీ)రక్తం మారుతుందన్నారు.ఊసరవెల్లి లాగా రక్తం మార్చుకుంటున్నారు రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు.

 రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ శకం ముగిసినట్టేనని ఆయన చెప్పారు.రేవంత్ రెడ్డి ఫాథర్ ఆఫ్ థి ఐరెన్ లెగ్ అంటూ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి కాదు ఆయన పెయింటర్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఎప్పుడు జైలుకు వేళ్తాడో తెల్వదని ఆయన చెప్పారు.టీఆరెస్ ది క్యాట్ వాక్ కాదన్నారు.రేవంత్ రెడ్డిది మాత్రం జైల్ వాక్ అని ఆయన చెప్పారు.పదవులు వస్తే హుందాగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. కేసీఆర్ ను కేటీఆర్‌ను విమర్శించే ముందు పార్టీని సరి చేసుకోవాలని ఆయన సూచించారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు ఎవ్వరికీ ఇష్టం లేదన్నారు.సోనియాగాంధీ అంటే తెలంగాణ సమాజానికి ఒక అభిమానం ఉండేదన్నారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వడంతో ఆ అభిప్రాయం మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జైల్ పార్టీ అని ఆయన విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

 గుండు అరవింద్ ముందు బాండ్ పేపర్ పై సమాధానం ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ పై ఆయన మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు.టీపీసీసీ ప్రెసిడెంట్ పదవికి ఏడాదిగా కొండను తవ్వి  కాంగ్రెస్ పార్టీ ఎలుకను పట్టిందని ఆయన విమర్శించారు.

click me!