నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు: కేసు పెడతానన్న ఎమ్మెల్యే రాజాసింగ్

Published : Jan 31, 2019, 12:27 PM IST
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు: కేసు పెడతానన్న ఎమ్మెల్యే రాజాసింగ్

సారాంశం

సిటీ మధ్యలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ వద్దని గతంలో అసెంబ్లీ వేదికగా చెప్పానన్నారు. గురువారం ఎగ్జిబిషన్ సొసైటీపై కేసు పెడతానని స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమార్జనపై దృష్టిసారిస్తుందే తప్ప వ్యాపారులు, సందర్శకుల భద్రతపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.   

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమాలకు అడ్డాగా మారిందని ఘోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అగ్నిప్రమాదం సంఘటన జరిగిన నేపథ్యంలో ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

 సిటీ మధ్యలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ వద్దని గతంలో అసెంబ్లీ వేదికగా చెప్పానన్నారు. గురువారం ఎగ్జిబిషన్ సొసైటీపై కేసు పెడతానని స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమార్జనపై దృష్టిసారిస్తుందే తప్ప వ్యాపారులు, సందర్శకుల భద్రతపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. 

ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమాలపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. మరోవైపు ప్రమాదం జరిగి 14గంటలు దాటుతున్న ఇప్పటి వరకు ఒక్క అధికారికి కూడా తమ వద్దకు రాలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ వద్ద మెురపెట్టుకున్నారు. తాము లక్షలాది రూపాయలు అప్పుచేసి స్టాల్స్ పెట్టామని తమను ఆదుకోవాలని వారు కోరారు.    

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ