టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు

First Published Sep 5, 2017, 8:28 PM IST
Highlights
  • ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు
  • లేఖ పంపిన భారత హోంమంత్రిత్వ శాఖ
  • రమేష్ వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే
  • జర్మనీ పౌరసత్వం వదులుకోని రమేష్

టిఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దయింది. కేంద్ర హోం శాఖ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఈ మేరకు రమేష్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖ చెన్నమనేని రమేష్ కు అందింది. ఆయనకు జర్మనీ పౌరుడు. అయితే, భారత పౌరసత్వం సంపాదించారు. దీనికి తప్పుడు ప్రతాలు వాడారన్నది ఆభియోగం. 

ఇపుడు హోం శాఖ దీనిమీద నిర్ణయం తీసుకుంది. అయితే మరోసారి సంయుక్త కార్యదర్శి వద్ద సవాలు చెయ్యాలని చెన్నమనేని రమేష్ భావిస్తున్నారు. చెన్నమనేని రమేష్ తెలంగాణలోని వేములవాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోమ్ శాఖా సంయుక్త కార్యదర్శి నుంచి చెన్నమనేని రమేష్ కు లేఖ. అందడంతో టిఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైంది. వేములవాడ నుంచి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్ 31-3-2008 లో భారత పౌరసత్వం 1955 ఆక్ట్ ప్రకారం అప్లై చేసుకున్నారు.  అ దరఖాస్తు చేసుకునే తేదీ  నాటికి  భారత్ లో 365 రోజులు వుండాలి అనే నిబంధన ఉంది. కానీ అంతకు ముందు 365 రోజులు అయన భారత దేశంలో లేడు.ఇది అనర్హత. అందువల్ల  వేములవాడ TRS MLA చెన్నమనేని రమేష్  భారత దేశ పౌరసత్వన్ని రద్దు చెయ్యాలంటు  ఎన్నికల్లో ఆయన మీద  పోటీ చేసిన ఆదిశ్రీనివాసులు పిటిషన్ వేశారు. ఆరు నెలల్లో కేసును పూర్తి చెయ్యాలని కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది.

రమేష్ బాబు 1993లో భారత దేశ పౌరసత్వన్ని రద్దు చేసుకొని జర్మనీ దేశ పౌరసత్వన్ని పొందారు. తిరిగి 2009లో భారత దేశ పౌరసత్వన్ని పొందారు. తప్పుడు ధృవ పత్రాలు చూపించి భారత దేశ పౌరసత్వన్ని పోందారని ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఉమ్మడి హైకోర్టు తప్పుడు దృవ పత్రాలు చూపించారని ఏకీభవించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేష్ బాబు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు తీర్పు మీద స్టే విధించిన సుప్రీంకోర్టు. 2016 ఆగస్టు 11న  ఆరు నెలలో దీని మీద దర్యాప్తు పూర్తి చెయ్యాలని కేంద్ర హోమ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ మరింత గడువు కోరింది. ఆ గడువు పూర్తి అయినందున హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

చెన్నమనేని గతంలో టిడిపి తరుఫున వేములవాడ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో ఆయన టిఆర్ఎస్ లో చేరారు. టిడిపికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో పోటీ చేసి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఆయన టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగాా గెలిచారు.

 

 

 

 

click me!