
హైదరాబాద్:వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే Balka Suman విమర్శించారు.
ఆదివారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో రైతులకు ఇప్పుడు ఏం చెబుతారని బండి సంజయ్ ను బాల్క సుమన్ ప్రశ్నించారు.
దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని చెప్పే BJP నేతలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన Paddy ధాన్యం సేకరణ విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉందని ఆయన చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని తాము రైతులను కోరిన విషయాన్ని బాల్క సుమన్ చెప్పారు.
యాసంగిలో వరి ధాన్యానికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని తాము కోరిన విషయాన్ని సుమన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.అయితే రైతాంగాన్ని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుBandi Sanjay రెచ్చగొట్టి వరి ధాన్యం కొనుగోలు చేసేలా ప్రేరేపించారని సుమన్ మండి పడ్డారు. ఈ మేరకు ఓ వీడియో క్లిప్పింగ్ ను మీడియాకు చూపారు.
యాసంగిలో ఎంత వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందనే విషయమై ప్రణాళికను సిద్దం చేసుకోవాలని బండి సంజయ్ కేసీఆర్ కోరిన మరో వీడియోను సుమన్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. యాసంగిలో ఎంత ధాన్యం కేంద్రానికి ఇస్తారో కేంద్రానికి లేఖ రాయాలని కూడా సంజయ్ కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేయడాన్ని తమ పార్టీ బాధ్యత తీసకొంటామని సంజయ్ మాట్లాడారన్నారు.
యాసంగిలో వరి ధాన్యం వేయవద్దని తాము చెప్పినా కూడా బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. కానీ ఇప్పుడేమో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతుందన్నారు. కానీ ఈ విషయమై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
బాధ్యతను విస్మరించి రైతుల పొట్టకొట్టేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని సుమన్ విమర్శించారు.నూకలు తినండి అంటూ కేంద్ర మంత్రి Piyush Goyal తెలంగాణ ప్రజలను అవమానించారనిని సుమన్ మండిపడ్డారు.
Telangana రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి గతంలో కంటే పెరిగిందని సుమన్ వివరించారు. మిషన్ కాకతీయతో చెరువుల కింద ఆయకట్టు పెరిగిందన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంతో కూడా ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరిగిందన్నారు. గతంలో కరువుతో ఉనన జిల్లాలు కూడా ఇవాళ కోనసీమ మాదిరిగా మారాయని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగానే తెలంగాణలో వరి ఉత్పత్తి పెరిగిందని సుమన్ విమర్శించారు.
పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. ఇదే విషయమై గత వారంలో తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసింది. వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ సర్కార్ రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ విమర్శించారు. పీయూష్ గోయల్ తీరును నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం తీవ్రంగా తప్పు బట్టింది