ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: కేటీఆర్ పై విమర్శలకు రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ కౌంటర్

Published : Mar 30, 2022, 04:45 PM ISTUpdated : Mar 30, 2022, 04:59 PM IST
ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: కేటీఆర్ పై విమర్శలకు రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ కౌంటర్

సారాంశం

 తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్  ఫైరయ్యారు.  కేటీఆర్ పై విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.

హైదరాబాద్: కేటీఆర్ పై విమర్శలు చేసే సమయంలో రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  బాల్క సుమన్ సూచించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పై Revanth Reddy చేసిన విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు.  బుధవారం నాడు TRS శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.  రేవంత్ రెడ్డి కాదు రవ్వంత రెడ్డి అంటూ  సుమన్ సెటైర్లు వేశారు. కేటీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఒక రవ్వంత మాత్రమేనన్నారు.  కేటీఆర్ పై విమర్శలు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సుమన్ రేవంత్ రెడ్డికి హితవు పలికారు. కేటీఆర్ గ్లోబల్ లీడర్ గా ఎదిగాడన్నారు.BJP కి Congress పార్టీ లోపాయికారిగా పనిచేస్తుందని బాల్క సుమన్ విమర్శించారు.  

రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు గుజరాత్ గులాములు అంటూ ఫైరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బానిసలన్నారు. రేవంత్ రెడ్డి TDP లో ఉన్న సమయంలో సోనియా గాంధీని బలి దేవత అన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్, బీజేపీ నేతలను నమ్ముకొంటే రాష్ట్రానికి ఏం ఒరగదన్నారు. రాహుల్ గాంధీ  రహస్యంగా విదేశాల్లో పర్యటించారని సుమన్ విమర్శించారు.  కేటీఆర్ అమెరికా పర్యటనకు సంబంధించి ప్రతి విషయాన్ని వెల్లడించారన్నారు. 

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాష్ట్ర రైతాంగాం చేసే పోరాటానికి మద్దతు ఇస్తున్నామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ విషయమై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ల యుద్దం సాగుతుంది. అమెరికా పర్యటన నుండి రాష్ట్రానికి వచ్చిన కేటీఆర్ రాహుల్ గాంధీ  ట్వీట్ పై విమర్శలు చేశారు.  దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు.

కేంద్రంలోని అధికార బీజేపీ,ప్ర‌తిపక్ష కాంగ్రెస్ ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పదే పదే తెలంగాణ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించిన ఢిల్లీలో అధికారంలో ఉన్న వారిపై తన విమర్శలను మళ్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూచించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరును పోల్చడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై ఇవాళ రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన  కార్యక్రమాలు, పథకాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఈ విషయమై చర్చకు సిద్దమన్నారు.  ఏ అంశంపై చర్చకు వస్తారో చెప్పాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై బాల్క సుమన్ స్పందించారు.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం