
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం KCR అప్పుల కుప్పగా మార్చాడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay విమర్శించారు. కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ పత్రిక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, మిగులు రాష్ట్రమని చెబుతూనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పాలనపై బండి సంజయ్ మండిపడ్డారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు. రోజుకో జిల్లాకు జీతాలు చెల్లిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు రెండు ప్రతి నెల రెండో వారానికి చేరుకుందని సంజయ్ ఆరోపించారు. 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉద్యోగులకు జనవరి నెల జీతం ఇంకా చెల్లించలేదని బండి సంజయ్ గుర్తు చేశారు.
జీపీఎఫ్ లో ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదన్నారు. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల కోసం దాచుకున్న డబ్బులు చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ చేసుకొంటే ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్పోరేట్ ఆసుపత్రులు ఉద్యోుగులకు వైద్యం చేయడం లేదని బండి సంజయ్ విమర్శించారు.