హైద్రాబాద్‌పై బీజేపీ కుట్రలు: ఎంపీ అరవింద్ విమర్శలకు బాల్క సుమన్ కౌంటర్

By narsimha lodeFirst Published Nov 30, 2021, 4:21 PM IST
Highlights

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు.

 హైదరాబాద్:  హైద్రాబాద్‌పై బీజేపీ కుట్రలు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అర్వ చేసిన విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటరిచ్చారు.పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల ముందు Dharmapuri Arvind ఇచ్చిన హామీని నిలుపుకోలేదన్నారు.Bjp ఎంపీలు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని Balka Suman మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్  సన్నాసి అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉందో కన్పించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది.. నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై కేంద్ర మంత్రులపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిప్డారు. కేంద్ర మంత్రి చేతకానివాడంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

also read:ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలా మూస్తారో చూస్తాం: కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రం తెలిపింది. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు  చేయమని కేంద్రం ప్రకటించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రా రైస్ ను కొనుగోలు చేస్తామని చెప్పారు.  అయితే తెలంగాణ రాష్ట్రంలో  నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో  యాసంగిలో  బాయిల్డ్ రైస్ మాత్రమే రైతుల పండిస్తారని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బాయిల్డ్ రైస్ ను రైతులు వరిని పండిస్తారని తెలంగాణ సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎప్‌సీఐ బాయిల్డ్ రైస్ విధానాన్ని తీసుకొచ్చిందని  టీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. మరో వైపు వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 


వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ పోరాటంలో భాగంగా పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ విమర్శిస్తోంది. రైతులను ఈ రెండు పార్టీలు నట్టేట ముంచుతున్నాయని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

click me!