కమలం పార్టీ కాదు కార్పోరేట్ పార్టీ: బీజేపీకి టీఆర్ఎస్ కౌంటర్

Published : Apr 28, 2022, 04:48 PM ISTUpdated : Apr 28, 2022, 04:51 PM IST
 కమలం పార్టీ కాదు కార్పోరేట్ పార్టీ: బీజేపీకి టీఆర్ఎస్ కౌంటర్

సారాంశం

బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు చేసిన విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు. తాము లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పకుండా బీజేపీ నేతలు బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

హైదరాబాద్: కమలం పార్టీ కాదు కార్పోరేట్ పార్టీ అని BJP  నిరూపించుకుందని TRS ఎమ్మెల్యే Balka Suman చెప్పారు.
దేశంలో పెరిగిన ధరలను తగ్గించాలని అడిగితే దాని గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. 

గురువారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్రప్రభుత్వంపై బీజేపీ చేసిన విమర్శలకు ఇవాళ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కౌంటరిచ్చారు. 

బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు బాల్క సుమన్ కౌంటరిచ్చారు.తాము లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పుకోలేని బీజేపీ నేతలు తమపై తిట్లదండకం పెడుతున్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను బయట పెట్టినందుకే  బీజేపీలో వణుకు మొదలైందన్నారు.సంక్షేమ పథకాల రూపంలో కేసీఆర్ సర్కార్ ప్రజలకు సంపదను పంచుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు సంపదను దోచి పెడుతుందన్నారు.

పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిన చరిత్ర బీజేపీదేనన్నారు.  ఏడున్నర టీఆర్ఎస్ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరు నుండి ప్రజలు తిరిగి స్వంత జిల్లాకే  వస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలనలో ఉన్నావ్, హత్రాస్ , లఖీంపూర్ లాంటి ఘటనలు చోటు చేసుకొన్నాయన్నారు. నీరవ్ మోడీ,లలిత్ మోడీలు దేశం విడిచి పారిపోయాన్నారు. 11 లక్షల కోట్ల అప్పులను కార్పోరేట్ కంపెనీలకు మోడీ సర్కార్ రద్దు చేసిందన్నారు. కానీ పేదలకు ఏం చేసిందో చెప్పాలని సుమన్ ప్రశ్నించారు.  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల రూపంలో తాము  పేదలకు సహాయ పడుతున్నామని బాల్క సుమన్ వివరించారు. పేద ప్రజల ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చి వేస్తున్నారన్నారు. 

టీఆర్ఎస్ ను కుటుంబ పార్టీగా విమర్శలు చేస్తున్న  కమలం పార్టీ నేతలు తమ పార్టీలో నేతల గురించి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎందరు సీఎంల పిల్లలు, కేంద్ర మంత్రుల పిల్లలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నారని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధ శవపేటికల నుండి రాఫెల్ యుద్ద విమానాల స్కాంలలో బీజేపీ కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఇంత వరకు ఎందుకు వాటిని నిరూపించలేకపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. భారతదేశంలో అవినీతిని వ్యవస్థీకృతం చేసింది మోడీ, అమిత్ షాలేనని బాల్క సుమన్  విమర్శించారు.

డబుల్ ఇంజన్ గ్రోత్ కి దేశ ప్రజలు ెర్ర జెండా చూపారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరిుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో ఓ మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన విషయాన్ని బాల్క సుమన్ గుర్తు చేశారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?