TRS MLA Balka Suman: "అతిగా మాట్లాడితే.. నాలుక చీరేస్తాం.." ఈటెలకు బాల్క సుమ‌న్ వార్నింగ్  

Published : Jul 26, 2022, 01:35 PM IST
TRS MLA Balka Suman: "అతిగా మాట్లాడితే.. నాలుక చీరేస్తాం.." ఈటెలకు బాల్క సుమ‌న్ వార్నింగ్  

సారాంశం

TRS MLA Balka Suman: వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రి గా చేసింది కేసీఆర్ యేనని, ఈటెల విశ్వాస ఘాతకుడని, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారని నిప్పులు చెరిగారని.. ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తామ‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ వార్నింగ్‌ ఇచ్చారు. 

TRS MLA Balka Suman: బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై టీఆర్ ఎస్ నేత బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారనీ, వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రి గా చేసింది కేసీఆర్ యే అని అన్నారు. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2004 కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ? అని  ప్ర‌శ్నించారు. ఈటెల శిఖండి రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. 

ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని.. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారారని అన్నారు. హుజూరాబాద్ లో ఈటెల ఓటమి ఖాయమ‌నీ, అందుకే గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలో ఈటెల బానిస‌లా బ‌తుకుతున్నాడ‌నీ, ఆయ‌న‌ ఓ చెల్లని రూపాయని బాల్క సుమ‌న్ విమ‌ర్శించారు. 

ప‌బ్లిసిటీ కోసమే ఈటెల తంటాలు ప‌డుతున్నాడ‌నీ, బీజేపీ లో ఈటెల ది బానిసలా బతుకుతున్నాడ‌నీ,  వరదల్లోనూ బీజేపీ కండువాలు కప్పుతూ బురద రాజకీయం చేశాడ‌నీ, తెలంగాణ రాజ‌కీయాల‌లో  ఈటెల  శిఖండి వంటి వాడ‌నీ, తెలంగాణ కంట్లో నలుసు లా మారారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ లు తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలు గా మారాయనీ, పదవులు రాజకీయాలు తప్ప బీజేపీ కాంగ్రెస్ లకు ఈ వరదల్లో ప్రజల ఘోష పట్టడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 
బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటెలదనీ, ఈటెల చిట్టాను బయటకు తెస్తాం..కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని బాల్క‌సుమ‌న్ స్పష్టం చేశారు. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారనీ, నోరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఈటెల దమ్ముంటే మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలని బ‌హిరంగంగా సవాల్‌ విసిరారు. ప్ర‌స్తుతం హుజురాబాద్ లో ఒడిపోతాననే తెలిసి ఈటెల కొత్త పల్లవి అందుకున్నారని, మొన్న ఈటెల కాంగ్రెస్, రేవంత్ ల సాయం తో గెలిచారనీ, ఈటెల ఎక్కువ మాట్లాడితే..  ఆయన నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
 
ఈటెల నల్లికుట్ల రాజకీయాలు నడవవ‌నీ, తెలంగాణ రాజకీయాల్లో ఓ విష పురుగు ఈటెల అని, ఈటెల మోడీ కి అమిత్ షా గులాం లా పని చేస్తున్నాడనీ, మంత్రిగా ఉన్నపుడు కాళేశ్వరం ను అద్భుత ప్రాజెక్టు గా పేర్కొన్న ఈటెల ఇపుడు పార్టీ మారి తిడుతున్నారని, ఈటెల గోడ మీద పిల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఆర్థిక మంత్రిగా చేసి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

20 మంది టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటెల అంటున్నారు. కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరని, రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీ ఆర్ ఎస్ లో చేరికలుంటాయని అన్నారు. బీజేపీ భావజాలాన్ని ప్రజలు బొంద పెట్టే రోజులు ఎంతో దూరం లో లేవని అన్నారు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టె రకం ఈటెలని, హుజురాబాద్ లో ఈటెల ను గెలిపించినందుకు ప్రజలు భాధ పడుతున్నారని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu