హైదరాబాద్ లో ఆదాయపన్ను శాఖతో ఏర్పడిన వారసత్వ కేసులో 22యేళ్ల తరువాత తీర్పు వచ్చింది. తెలంగాణ హైకోర్టు సోమవారం స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నింటినీ తిరిగి వారికి అప్పగించాలని ఐటీ శాఖను ఆదేశించింది.
హైదరాబాద్ : హైదరాబాద్ లో 22యేళ్ల వారసత్వ కేసులో తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఐటీ శాఖ ఆధీనంలో ఉన్న రెండున్నర కిలోల బంగారాన్ని చట్టపరమైన వారసులకు అందించాలని తీర్పునిచ్చింది. దీనికోసం ఇద్దరు చట్టపరమైన వారసులకు వేర్వేరు వారసత్వ ధృవీకరణ పత్రాల కోసం పట్టుబట్టడాన్ని తప్పుపట్టింది. చట్టపరమైన వారసులే ఆభరణాలను పొందినట్లు బాండ్ ఇచ్చి.. బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ వారసులకు తెలిపింది.
అమీర్‌పేట్‌లోని రాజా ధరమ్ కరమ్ రోడ్డుకు చెందిన నీలేష్ కుమార్ జైన్, ముఖేష్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ శాఖతో 22 ఏళ్ల పోరాటం తర్వాత హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబానికి 2.5 కిలోల బంగారం తిరిగి దక్కింది. పిటిషనర్లు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 10, 2000న వారి తల్లిదండ్రుల ఇంటి నుండి 2,462 గ్రాముల బంగారు ఆభరణాలు, పత్రాలను I-T డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుంది. దీంతో ఆ ఆభరణాలకు చట్టపరమైన వారసుల వాటిని తిరిగి తమకు అప్పగించాలని న్యాయపరమైన పోరాటం మొదలుపెట్టారు.
undefined
మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన ఉప సర్పంచ్..
ఎట్టకేలకు ఈ వివాదం 'డైరెక్ట్ ట్యాక్స్ వివాహ్ సే విశ్వాస్ యాక్ట్' కింద పరిష్కరించబడింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 31, 2021న ఒక ఉత్తర్వును ఆమోదించింది. అయితే ఇద్దరు సోదరుల నుండి వేర్వేరు వారసత్వ ధృవీకరణ పత్రాలు కావాలంటూ I-T డిపార్ట్‌మెంట్ పట్టుబట్టడంతో తీర్మానం నిలిచిపోయింది. చట్టపరమైన వారసుల తరఫు సీనియర్ న్యాయవాది శరద్ సంఘీ, ఇండియన్ బ్యాంక్‌లో ఉన్న డిపాజిట్‌ను ఎన్‌క్యాష్ చేయడానికి ఇప్పటికే వారసత్వ ధృవీకరణ పత్రం పొందినందున.. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా వారసత్వ సర్టిఫికేట్ అవసరం లేదని ధర్మాసనానికి తెలియజేశారు.అదే సర్టిఫికేట్‌ను I-T అధికారులు కూడా అంగీకరించవచ్చు. కానీ వాళ్లు విడిగా వారసత్వ సర్టిఫికెట్ కావాలని పట్టుబడుతున్నారు’’ అని తెలిపారు.
అయితే, అవి తనకు కూడా చెందాలని పిటిషనర్ల సోదరి కూడా తరువాత దావా వేసే అవకాశం ఉందని.. అందుకే ముందు జాగ్రత్తగా వారసత్వ సర్టిఫికెట్ అదుగుతున్నారని I-T డిపార్ట్‌మెంట్ సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం, అటువంటి సందర్భంలో, సోదరి.. తన సోదరులపై మాత్రమే దావా వేయగలదని, ఐటీ శాఖపై కాదని పేర్కొంది. ఆభరణాలను చట్టబద్ధమైన వారసులే తీసుకుంటున్నట్లు డిపార్ట్‌మెంట్‌కు ఒక బాండ్ ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్లను ఆదేశించింది. ఆ బాండు తీసుకుని బంగారాన్ని విడుదల చేయాలని ఐటి శాఖను ఆదేశించింది.