15రోజుల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ: కేశవరావు

Published : Sep 15, 2018, 09:12 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
15రోజుల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ: కేశవరావు

సారాంశం

 15 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన పూర్తవుతుందని టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది.  ఈ సందర్భంగా మావేశంలో మెుత్తం 20అంశాలను చర్చించినట్లు తెలిపారు. 

హైదరాబాద్‌: 15 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన పూర్తవుతుందని టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది.  ఈ సందర్భంగా మావేశంలో మెుత్తం 20అంశాలను చర్చించినట్లు తెలిపారు. ప్రజల నుంచి 170 వరకు వినతి పత్రాలు అందాయని కొత్తగా ఏయే అంశాలను చేర్చాలన్న అంశంపై కూడా చర్చించినట్లు తెలిపారు. 

ఇతర పార్టీల కంటే మంచి మేనిఫెస్టోను ప్రజలకు అందిస్తామన్నారు. మేనిఫెస్టో ముసాయిదాను నిబంధనల ప్రకారం ఈసీకి సమర్పిస్తామని కేకే తెలిపారు. మంచి మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.  మరో నాలుగుసార్లు మేనిఫెస్టో కమిటీ భేటీ అవుతామని ఆ తర్వాత సీఎంతో చర్చించి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. 

మరోవైపు అసెంబ్లీని రద్దు చేయడమనేది రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కు అన్నకేకే అసెంబ్లీ రద్దు మా సాహసానికి నిదర్శనమన్నారు. గతంలో కన్నాఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తామన్నారు. తాజా సర్వేలన్నీ టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్తున్నాయని గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu