బీజేపీ కార్యాలయం ముందు బియ్యం బస్తాలు పడేసి.. టీఆర్ఎస్ నిరసన.. వరంగల్ లో ఉద్రిక్తత..

By SumaBala Bukka  |  First Published Mar 26, 2022, 10:41 AM IST

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వరంగల్ టీఆర్ఎస్ నాయకులు వినూత్నరీతిలో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 


వరంగల్‌ : telanganaలో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు central governament నిరాకరించడాన్ని నిరసిస్తూ warangal జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ మేయర్‌ గుండ ప్రకాశరావు, రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో శుక్రవారం ఎద్దుల బండిలో paddy bagsను తీసుకొచ్చి బీజేపీ కార్యాలయం ఎదుట పడేశారు. సమాచారం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని టీఆర్‌ఎస్ నేతలతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి వరి బస్తాలను తొలగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా ప్రకాశరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే పరిమితం చేస్తోందని ఆరోపించారు. కానీ, అదే కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో పంజాబ్ నుండి ఆహార ధాన్యాలను సేకరిస్తున్నదని ఆయన అన్నారు. రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజాదరణను దెబ్బతీసేందుకే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.

Latest Videos

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని మాజీ మేయర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులు బండ్ల సురేందర్, పవన్, శివ పటేల్, బుర్రి ప్రకాష్, మాగంటి శివకుమార్, రాంచందర్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, Property Tax చెల్లించడం లేదని Municipal Staff ఓ ఇంటిముందు చెత్త పోసిన ఘటన Jagtial జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని పురాణిపేటకు చెందిన హైమద్ బిన్ సాలెం ఇంటి మీద రూ. 54వలే ఆస్తిపన్ను బకాయి ఉంది. అయిదు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి మొత్తం రూ.1.04 లక్షలు చెల్లించాల్సిందిగా పురపాలక అధికారులు పలుమార్లు కోరారు. వారింట్లో ఇటీవల ఇద్దరు మృతి చెందడం, స్థానికంగా వారు ఎక్కువగా ఉండకపోవడంతో చెల్లింపులో జాప్యం జరిగింది. గురువారం పన్ను చెల్లించాలని పురపాలక సిబ్బంది కోరగా అప్పటికప్పుడు పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించలేమని, ప్రస్తుతానికి రూ.25 వేలు చెల్లిస్తామని హైమద్ బిన్ సాలెం చెప్పారు. 

దీనికి వారు అంగీకరించకుండా బకాయి పూర్తిగా చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో పాటు ట్రాక్టర్ లో చెత్త తెప్పించి ఇంటిముందు కుప్పగా పోశారు. దీంతో సిబ్బందితో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరికి అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో చెత్తను పురపాలక సిబ్బంది తొలగించారు. ఈ సంఘటన మీద పురపాలక కమిషనర్ జె.స్వరూపారాణి సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేశారు. 

click me!