కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన... టీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..?

By Siva KodatiFirst Published Oct 2, 2022, 6:46 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా దసరా రోజున కొత్త జాతీయ పార్టీకి సంబంధించిన ప్రకటన చేయనున్నారు. 
 

కేసీఆర్ తెలంగాణను దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్‌ను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. దేశ తలరాతను మార్చేసే నిర్ణయం చెప్పబోతున్నారని కవిత అన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీకి సంబంధించి కేసీఆర్ తమ అందరి అభిప్రాయాలను తీసుకున్నారని ఆయన అన్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మాకు వివరించారని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. సహజ వనరులు సమృద్ధిగా వున్నా దేశం ఇంకా అభివృద్ధి చెందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 5న పార్టీలో అందరితో చర్చించి తీర్మానం పెడతామని కాంతారావు అన్నారు. 

ఇకపోతే.. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల 5వ తేదీన 283 మందితో తీర్మానం చేయనుంది టీఆర్ఎస్.  పార్టీకి  చెందిన ప్రజా ప్రతినిధులు,నేతలు  283మంది  సమావేశానికి హాజరుకానున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు  తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. 

ALso REad:ఈ నెల 5 మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ: 283 మందితో తీర్మానం చేయనున్న టీఆర్ఎస్

ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, గ్రంథాలయ సంస్థల చైర్మెన్లు, డీసీసీబీ చైర్మెన్లు, డీసీఎంఎస్ చైర్మెన్లు, జిల్లా పరిషత్ చైర్మెన్లు సహ ప్రజా ప్రతినిధులతో పాటు నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానం చేసిన తర్వాత అదే రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. అంతేకాదు ఈ సమావేశం రోజున కొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రానున్నారని సమాచారం..  పలు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కొన్ని సంస్థలు కూడా టీఆర్ఎస్ లో విలీనమయ్యే అంశాలపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరును మార్చనున్నారు.  దీంతో పార్టీ ఎన్నికల గుర్తు కారు కొనసాగనుంది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. టీఆర్ఎస్ కేవలం తెలంగాణకు సంబంధించిందే. దీంతో టీఆర్ఎస్ పేరును మార్చనున్నారు.  
 

click me!