బెజవాడ టికెట్ కోసమే లగడపాటి సర్వే: వివేక్ సంచలన వ్యాఖ్యలు

Published : Dec 10, 2018, 09:18 AM ISTUpdated : Dec 10, 2018, 10:02 AM IST
బెజవాడ టికెట్ కోసమే లగడపాటి సర్వే: వివేక్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జీ.వివేక్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే లగడపాటి మహాకూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను విడుదల చేశారని ఆరోపించారు.

సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేయాలని రాజగోపాల్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఎవరిని గెలిపించాలో, తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తారని వివేక్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత లాభం కోసమే కూటమికి అనుకూలంగా లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేస్తున్నారని వివెక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మహాకూటమి అధికారంలోకి వస్తుందని రాజగోపాల్ సర్వే వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
 
PREV
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !