
సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్ నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించడంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి వారినైనా తెలంగాణ ప్రభుత్వం అనుమతించదన్నారు.. అది కత్తి మహేశ్ అయినా ఇంకో మహేశ్ అయినా... ప్రజల మధ్య సామరస్యాన్ని చెడగొడితే ఊరుకోబోమన్నారు... కత్తిపై తీసుకున్న నిర్ణయానికి డీజీపీని అభినందిస్తున్నామన్నారు..
అలాగే ప్రాధాన్యత లేని వ్యక్తుల మాటలను ప్రసారం చేసేటప్పుడు మీడియా మరింత సంయమనం పాటించాలని సూచించారు.కాగా, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాతో పాటు మరికొన్ని ఛానెళ్లను వేదికగా చేసుకుని సమాజంలో అలజడులు సృష్టిస్తున్న.. కత్తి మహేశ్‌ను ఆరు నెలల పాటు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ ప్రకటించారు. ఈ ఆరునెలల కాలంలో పోలీసుల ముందుస్తు అనుమతి లేకుండా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.