టీఆర్ఎస్ కు గుడ్ బై ఖాయం: డిఎస్ రహస్య భేటీ

First Published Jul 9, 2018, 4:40 PM IST
Highlights

తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి డిఎస్ తన అనుచరులతో సమావేశమయ్యారు. కొంపల్లిలోని ఓ హోటల్లో ఆయన తన అనుచరులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. 

మేడ్చల్: రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతో సహా టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు తనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని భావిస్తున్నారు.

కేసీఆర్ కూడా డిఎస్ పై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దానికితోడు, డిఎస్ తో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టంగా లేరని చెబుతున్నారు. ఈ స్థితిలో తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి డిఎస్ సిద్ధపడుతున్నారు.

డిఎస్ సోమవారం కొంపల్లిలోని ఓ హోటల్లో తన అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, జక్రాన్ పల్లి, దర్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల సర్పంచులు, జెడ్ పిటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అనుచరుల అభిప్రాయాలు తీసుకుని ఆయన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటారని అంటున్నారు. అయితే, డిఎస్ కాంగ్రెసులో చేరడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందనే మాట వినిపిస్తోంది.

click me!