అప్పు పుట్టించడం ఎలాగో.. భారత్‌కు నేర్పిన వ్యక్తి బాబుగారు: హరీశ్

Published : Nov 29, 2018, 12:24 PM ISTUpdated : Nov 29, 2018, 12:51 PM IST
అప్పు పుట్టించడం ఎలాగో.. భారత్‌కు నేర్పిన వ్యక్తి బాబుగారు: హరీశ్

సారాంశం

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలైందని చంద్రబాబు అంటున్నారని.. ఏపీలో అప్పులు తీసుకురాకుండా ఆయన ముందుకు వెళ్లగలరా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలైందని చంద్రబాబు అంటున్నారని.. ఏపీలో అప్పులు తీసుకురాకుండా ఆయన ముందుకు వెళ్లగలరా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రపంచబ్యాంక్‌ నుంచి అప్పులు ఎలా తెచ్చుకోవాలో భారతదేశానికి నేర్పిన వ్యక్తి చంద్రబాబన్నారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చారని హరీశ్ అన్నారు. మహాకూటమిలో ఉన్న చాడ వెంకటరెడ్డి చంద్రబాబు అప్పులపై ప్రపంచబ్యాంక్ జీతగాడు అని పుస్తకం ముద్రించారని మంత్రి ఎద్దేవా చేశారు.

మోడీని కలిసినప్పుడు ఆయనతో, రాహుల్‌ను కలిసినప్పుడు ఆయనతో ఈ కలయిక చారిత్ర అవసరం అన్నారని.. చారిత్ర అవసరం దేశానికి కాదని.. అది తన అవసరమన్నారు. నాలుగేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని.. మేనిఫెస్టోలో ప్రకటించని హామీలను సైతం అమలు చేసని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. కేసీఆర్ మాట తప్పని.. మడమ తిప్పని లీడర్ అని హరీశ్ రావ్ ప్రశంసించారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?