అమ్మో..!! బాబు లాంటి లీడర్ దేశంలో లేడు: హరీశ్ రావు

Published : Nov 29, 2018, 12:14 PM ISTUpdated : Nov 29, 2018, 12:50 PM IST
అమ్మో..!! బాబు లాంటి లీడర్ దేశంలో లేడు: హరీశ్ రావు

సారాంశం

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయలో మండిపడ్డారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014లో చెప్పిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదన్నారు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయలో మండిపడ్డారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014లో చెప్పిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదన్నారు..

ఆయన్ను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ఏపీలో రైతులు ఎదురుచూస్తున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. చివరి వరకు తెలంగాణను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదన్నారు.. గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి ఇరు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదన్న చంద్రబాబు నాయుడు.. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని హరీశ్ రావు ప్రశ్నించారు.

తన స్వప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఏపీ సీఎం రాజీ పడతారని హరీశ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని అమరావతికి పారిపోయారని మంత్రి దుయ్యబట్టారు. అక్కడో మాట.. ఇక్కడో మాట మాట్లాడుతుంటారని.. ఆయనది రెండు కళ్ల సిద్ధాంతమని, రెండు నాల్కల ధోరణి అని.. అలాంటి లీడర్ దేశంలోనే లేడన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?