గద్ధర్‌పై జాలేస్తోంది...బుల్లెట్ దించిన వ్యక్తినే కౌగిలించుకున్నారు: హరీశ్

sivanagaprasad kodati |  
Published : Nov 29, 2018, 12:00 PM IST
గద్ధర్‌పై జాలేస్తోంది...బుల్లెట్ దించిన వ్యక్తినే కౌగిలించుకున్నారు: హరీశ్

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నిన్న ఖమ్మం వేదికగా జరిగిన రాహుల్, చంద్రబాబుల సభను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాటల తూటల పేల్చారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాకవి గద్ధర్ అంటే తమకు చాలా గౌరవముందని.. ఆయన తన జీవితాన్ని ప్రజల కోసం అంకితమయ్యారని హరీశ్ ప్రశంసించారు

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నిన్న ఖమ్మం వేదికగా జరిగిన రాహుల్, చంద్రబాబుల సభను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాటల తూటల పేల్చారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాకవి గద్ధర్ అంటే తమకు చాలా గౌరవముందని.. ఆయన తన జీవితాన్ని ప్రజల కోసం అంకితమయ్యారని హరీశ్ ప్రశంసించారు.

తన కడుపులో బుల్లెట్ ఉందని తరచుగా చెప్పే గద్ధర్.. ఆ బుల్లెట్‌ను దించిన చంద్రబాబునే జనం సాక్షిగా కౌగిలించుకున్నారన్నారు. తెలంగాణ చరిత్రలో అది చాలా దుర్దినమన్నారు. రాష్ట్ర చరిత్రలో పౌరహక్కుల నేతలను అణచివేసి, విద్యుత్ ఛార్జీలు తగ్గించమని పోరాడిన ప్రజలను పిట్టల్లా కాల్చిపారేసిన ఘనత చంద్రబాబుదేనని హరీశ్ రావ్ మండిపడ్డారు. అలాంటి టీడీపీ అధినేతతో కోదండరామ్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగడాన్ని తెలంగాణ సమాజం హర్షించదని హరీశ్ ధ్వజమెత్తారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే