వికలాంగుడిని స్టేజీ పై నుంచి కిందకు లాగేసిన టీఆర్ఎస్ నేత..!

Published : Aug 25, 2021, 07:34 AM IST
వికలాంగుడిని స్టేజీ పై నుంచి కిందకు లాగేసిన టీఆర్ఎస్ నేత..!

సారాంశం

ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గాను.. ఆ వికలాంగుడిని స్టేజీ పై నుంచి కిందకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. అతను కింద పడిపోవడం గమనార్హం.

ఓ వికలాంగుడి పట్ల టీఆర్ఎస్ నేత అనుచితంగా ప్రవర్తించాడు.  స్టేజీ పై నుంచి కిందకు లాగేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో ఇటీవల టీఆర్ఎస్ ధూం ధూం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.

కాగా.. ఆ స్టేజీపై తనకు ఫింఛన్ రావడం లేదంటూ రాజేష్ అనే దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించాడు. దీంతో.., అతని పట్ల టీఆర్ఎస్ నేత ఒకరు అనుచితంగా ప్రవర్తించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గాను.. ఆ వికలాంగుడిని స్టేజీ పై నుంచి కిందకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. అతను కింద పడిపోవడం గమనార్హం.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా... టీఆర్ఎస్ నేతపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ కార్యక్రమానికి ముందే బాధితుడు అధికారులను కలిసి మాట్లాడాలని అనుకున్నాడు. అయితే...వారు అనుమతి ఇవ్వకపోవడంతో... అలా స్టేజీ ఎక్కి తన బాధను వెళ్లగక్కాడు. ప్రభుత్వంపై విమర్శలు చేశాడని.. అతనిని టీఆర్ఎస్ నేత కింద పడేశాడు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే