టికెట్ ఇవ్వరా..? ఒంటిపై పెట్రోల్ పోసుకున్న టీఆర్ఎస్ నేత

Published : Jan 08, 2020, 12:51 PM ISTUpdated : Jan 08, 2020, 01:04 PM IST
టికెట్ ఇవ్వరా..? ఒంటిపై పెట్రోల్ పోసుకున్న టీఆర్ఎస్ నేత

సారాంశం

 టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు మొదలైంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా... టికెట్ల కోసం కోట్లాట, పోట్లాట మొదలైంది.  టికెట్ దక్కించుకోవడానికి ఆశావాహులంతా ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలుతున్నారు. కాగా.. ఓ టీఆర్ఎస్ నేత మాత్రం ఏకంగా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని... ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.సికింద్రాబాద్, బోయినపల్లిలోని మంత్రి మల్లారెడ్డి కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read:తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు .. సంక్రాంతి కానుక...

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయిన్ పల్లిలోని  ఆయన ఇంటికి చేరుకున్నారు. 

ALSO READ: స్నేహితురాలిని ప్రేమ పేరుతో వంచన....గర్భవతిని చేసి చివరకు...

అప్పటికే టికెట్ల విషయంలో మంత్రి కార్యాలయంలో చర్చ  జరుగుతోంది.  అంతలోనే ఓ వ్యక్తి తనకు టికెట్ రాదని తెలుసుకున్నాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొనే ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించి అతని ప్రయత్నాన్ని విరమించారు.  ఈ ఘటనతో మంత్రి మల్లా రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Sankranti : సంక్రాంతికి ఈ గుడికి వెళ్తే మీ జాతకం మారిపోవడం ఖాయం ! పట్టిందల్లా బంగారమే!
CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu