జగ్గారెడ్డి హరీష్‌‌‌ను విమర్శించి,కేసీఆర్‌‌ని పొగడేది అందుకోసమే: చింతా ప్రభాకర్

By Arun Kumar PFirst Published Mar 1, 2019, 8:37 PM IST
Highlights

ఇటీవల కాలంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆరే టార్గెట్‌గా తీవ్ర విమర్శలకు దిగిన జగ్గారెడ్డి...ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేవలం హరీష్ రావుపైనే విమర్శలకు దిగుతున్నారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలా జగ్గారెడ్డి రెండు రకాల వ్యవహరించడానికి  గల కారణాలను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బయటపెట్టారు.  
 
మాజీ మంత్రి హరీష్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్న జగ్గారెడ్డిపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం ద్వజమెత్తారు. అసలు జగ్గారెడ్డి హరీష్ ను విమర్శిస్తూ, కేసీఆర్ ను  పొగడడానికి గల కారణాలేమిటో ఆయన వివరించారు. కేవలం కేసులు, జైలు శిక్షల నుండి బయటపడేందుకే ముఖ్యమంత్రిని పొగుడుతున్నాడని తెలిపారు. మరోవైపు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి మాజీ  మంత్రి హరీష్ రావుపై విమర్శలకు దిగుతున్నారన్నారు. ఇలా జగ్గారెడ్డి రెండు నాలుకల దోరణితో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సింగూరు, మంజీరా నీటిని మాజీ ఇరిగేషన్ మంత్రి దొంగిలించి సంగారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు అన్యాయం చేశాడని జగ్గారెడ్డి ఆరోపించడాన్ని ప్రభాకర్ ఖండించారు.  తెలంగాణ కు చెందిన  కరీంనగర్, నిజామాబాద్ రైతుల పంటను కాపాడేందుకే ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రాజెక్టులను నుండి నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు నీటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. 

జగ్గారెడ్డి పిచ్చిపట్టినట్లు అనవస రాద్దాంతం చేయడం చేయడం మానుకోవాలన్నారు. ఇప్పటికే చెల్లని రూపాయిగా మారిన జగ్గారెడ్డి...నియోజకవర్గ ప్రజల దృష్టిలో మరింత దిగజారేలా వ్యవహరించరాదని హెచ్చరించారు. గతంలోని కేసులకు తోడుగా తాజాగా భూకబ్జాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా వున్న జగ్గారెడ్డి ఇకనైనా నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని చింతా ప్రభాకర్ సూచించారు. లేకుంటే మరోసారి ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.   
 ‌  
 
click me!