కేసీఆర్‌కు దేశంలోనే అత్యున్నత పదవి... శ్రీవారిని కోరుకున్న టీఆర్ఎస్ మంత్రి

By Arun Kumar PFirst Published Mar 1, 2019, 6:43 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలంటూ తిరుమల వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలంగాణ ఆర్అండ్‌బి ,ట్రాన్స్‌పోర్ట్, హౌసింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అత్యన్నత పదవిని కేసీఆర్ పొందేలా చూడాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. 

తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం రావడంతో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు  ప్రశాంత్ రెడ్డి తెలిపారు.  గురువారమే తిరుపతి చేరుకున్న మంత్రి ఇవాళ  తెల్లవారుజామున అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. అనంతరం టిడిపి అధికారులు మంత్రితో పాటు ఆయన కుటుంబానికి 
ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దైవదర్శనం చేయించారు. 

ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీవారిని  దర్శించుకోవడానికి తిరుమల రావడం జరిగిందన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించి రాజకీయాల్లో మరింత ఉన్నత శిఖరాలకు చెరుకునేలా కరుణించాలని ప్రార్థించినట్లు మంత్రి వెల్లడించారు. 
 
click me!