‘మన ఊరు మన బడి’కి విశేష స్పందన.. కోటిన్నరతో స్కూల్ భనవ నిర్మాణానికి చల్మెడ నిర్ణయం.. కేటీఆర్‌తో భేటీ

Published : Feb 19, 2022, 03:17 PM ISTUpdated : Feb 19, 2022, 03:20 PM IST
‘మన ఊరు మన బడి’కి విశేష స్పందన.. కోటిన్నరతో స్కూల్ భనవ నిర్మాణానికి చల్మెడ నిర్ణయం.. కేటీఆర్‌తో భేటీ

సారాంశం

కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు మన బడిపై అంతటా సానుకూల చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు దాతల నుంచీ విశేష స్పందన వస్తున్నది. సిరిసిల్లలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో భవన నిర్మాణానికి రూ. 1.50 కోట్లను ఖర్చు చేయడానికి టీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహా రావు ముందుకు వచ్చారు.  ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్‌లో భేటీ అయి.. బిల్డింగ్ ప్లాన్, ప్రణాళికలను అందించారు.  

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మన ఊరు మన బడి’(Mana Ooru Mana Badi) పథకానికి దాతల నుంచి విశేష స్పందన వస్తున్నది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల(Infrastructure) అభివృద్ధి కోసం కేసీఆర్(KCR) ప్రభుత్వం రూ. 7,289 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి తోడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు ఎంతో మంది దాతలను సేవ చేయడానికి వీలు కల్పించింది. తాజాగా, ప్రభుత్వ పిలుపు మేరకు కరీంగర్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు(Chalmed Laxmi Narasimha Rao) స్పందించారు. ఏకంగా రూ. 1.50 కోట్లను ఇందుకు ఖర్చు చేస్తానని ప్రకటించారు. ఒక స్కూల్ భవనాన్ని నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌(KTR)ను హైదరాబాద్‌లో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. 

తన తండ్రి, మాజీ మంత్రి చల్మెడ ఆనంద్ రావు స్వగామ్రం సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మలకపేట. ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని ఆయనకు ఓ కల ఉండేది. ఆ కలను సాకారం చేయడానికి ఆయన కుమారుడు చల్మెడ లక్ష్మీ నరసింహా రావు ముందుకు వచ్చినట్టు చెప్పారు. తన తండ్రి మేరకు మలకపేటలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. సుమారు కోటిన్నర రూపాయలతో స్కూల్ భవన నిర్మానాన్ని కార్పొరేట్ పాఠశాల స్థాయిలో చేపడతామని తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్డింగ్ ప్లాన్‌లనూ, ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈ భవన నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ భవనాన్ని సిద్ధం చేసి సేవలకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆయన కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ పిలుపుతో కదలి ముందుకు వచ్చి.. కోటిన్నర రూపాయలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావును కేటీఆర్ అభినందించారు. ఒక ఉదాత్తమైన ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి ముందుకు వచ్చారని ప్రశంసించారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను ఇందుకు ఎంచుకోవడంపై కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా, లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆన్‌లైన్ త‌రుగతులు నిర్వ‌హించిన‌ప్పుడు..ఫీజు క‌డుతారా.. లేదంటే ఆన్‌లైన్ క్లాసుల లింక్‌ కట్‌ చేయమంటారా.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్ర‌వేట్ స్కూల్స్ యాజ‌మాన్యాలు హెచ్చ‌రించిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు.. తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలని, షరతులు విధించడం లేదంటే పాఠశాలలోనే బిల్లు చెల్లించాలని కరాఖండిగా చెప్పార‌ని విమ‌ర్శ‌లున్నాయి. గత నెలరోజుల నుంచి ఫీజుల వసూళ్లపై కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు దృష్టి సారించారు. మెస్సెజ్‌లు పెడుతూ, నేరుగా ఫోన్‌లో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో .. హైద‌రాబాద్  ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం ధనార్జనే ధ్యేయంగా  వ్యవహరిస్తుంద‌నీ.. త‌ర‌గతులు నిర్వ‌హించ‌కున్నా.. ఫీజులు చెల్లించాల‌ని ఒత్తిడి చేస్తుంద‌ని, అంతే కాకుండా సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఓ విద్యార్థి తండ్రి తన‌ గోడును  సోష‌ల్ మీడియా ట్విట‌ర్ వేదిక‌గా రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ కు వెల్ల‌బుచ్చుకున్నాడు. స‌ద‌రు విద్యాసంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం