టీఆర్ఎస్ కే మళ్లీ అధికారం.. ఇండియా టుడే తాజా సర్వే

By ramya neerukondaFirst Published Dec 5, 2018, 4:02 PM IST
Highlights

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే  ప్రజలు మళ్లీ అధికారం కట్టబెడుతున్నారంటూ ఇండియా టుడే తాజా సర్వే విడుదల చేసింది. 

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలో కి వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సర్వే  అంతా తూచ్.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే  ప్రజలు మళ్లీ అధికారం కట్టబెడుతున్నారంటూ ఇండియా టుడే తాజా సర్వే విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్, ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సర్వేలు సర్వాత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

ఇండియా టుడే సర్వే ప్రకారం.. గత నెల కన్నా.. ఈ నెలలో టీఆర్ఎస్ కి ప్రజల్లో మద్దతు మరో 4శాతం పెరిగింది. 17 నియోజకవర్గాల్లో ఇండియా టుడే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే నిర్వహించినట్లు సమాచారం.  ఆ సర్వేలో గత నెలలో 44శాతం మంది టీఆర్ఎస్ కి మద్దతు నిలవగా.. ప్రస్తుతం 48శాతం మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించింది. 

ఇక ప్రభుత్వం మారాలనే వారి సంఖ్య కూడా 4 శాతం పెరిగందని, గత నెలలో 34 శాతం మంది ప్రభుత్వ మార్పును కోరగా.. ప్రస్తుతం ఆ మద్దతు 38 శాతం  పెరిగిందన్నారు. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉండగా.. దక్షిణ తెలంగాణలో కూటమికి అనుకూలంగా ఉందని తెలిపింది.

టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు భీమా పథకాలపై ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఈ సర్వేలో తేలిందని ఇండియా టుడే తెలిపింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ 6,887మంది శాంపిల్స్ తీసుకోగా.. ఎక్కువ మంది టీఆర్ఎస్ కే ఓటు వేసినట్లు ఇండియా టుడే తన తాజా సర్వేలో వెల్లడించింది. 

ఇదిలా ఉండగా.. లగడపాటి, ఇండియా టుడే సర్వేలు.. వేటికవే భిన్నంగా ఉండటం గమనార్హం. 

click me!