ప్రారంభమైన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం: జాతీయ పార్టీ ఏర్పాటుపై కీలక తీర్మానం

By narsimha lode  |  First Published Oct 5, 2022, 12:25 PM IST

టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్ లో బుధవారం నాడు ప్రారంభమైంది.కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.  ఈసమావేశంలో  పార్టీ  పేరు మార్పుపై తీర్మానం చేయనున్నారు


హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం బుధవారం నాడు తెలంగాణ భవన్ లో  ప్రారంభమైంది.  జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు. 

ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్  తెలంగాణ భవన్ కు వచ్చారు. కేసీఆర్ వెంట కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే చీఫ్ తిరుమలవలన్  సహ ఆ పార్టీ నేతలున్నారు. తెలంగాణ భవన్ కు చేరుకున్న వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు

Latest Videos

undefined

జాతీయ రాజకీయాల్లో ప్రవేశించనున్నందున టీఆర్ఎస్  పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్ఎస్ పేరు మార్పునకు తీర్మానం చేయనున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  . 

జాతీయ రాజకీయాల్లోకి  ప్రవేశించాల్సిన ఆవశ్యకత గురించి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  పార్టీ ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సమయంలో పార్టీ పేరు  మార్పు విషయమై మాజీ స్పీకర్ మధుసూధనాచారి  ఏకవ్యాక్య తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు.ఈ తీర్మానానికి మద్దతుగా పలువురు ప్రతినిధులు మాట్లాడే అవకాశం ఉంది.ఈ తీర్మానంపై  సమావేశానికి హాజరైన ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు.

ఈ తీర్మానంపై  మధ్యాహ్నం 1:19 గంటలకు ఈ తీర్మానంపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఈ తీర్మానం ప్రతిని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం రేపు ఈసీకి అందించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మెన్లు, జిల్లా పరిషత్ చైర్మెన్లతో  పాటు పార్టీ నేతలు 283 మంది ఈ  సమావేశంలో పాల్గొన్నారు.  

also read:సంక్రాంతికి ఏపీలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్: ఆంధ్ర నేతలతో టచ్ ‌లో టీఆర్ఎస్

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ  ద్వారా పలు రాష్ట్రాల్లో కేసీఆర్  ప్రచారం  చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో  భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ బహిరంగ సభ తర్వాత ఏపీలో  సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఏపీలోని నేతలతో టీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్లారు.2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా  నిలువరిచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.  జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత చర్చలను మరింత వేగవంతం చేయనున్నారు. 


 

click me!