దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్ లో మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడే ఉన్న అందరికీ పంచి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, సిఎం వో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ పూజలుముగిసినతర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ తో భేటీ అయ్యారు. వారితో కలిసి అల్పాహరం తీసుకున్నారు. బ్రేక్ ఫాస్ట్ పూర్తైన తర్వాత జాతీయ రాజకీయాలపై చర్చించారు.
దసరా రోజునే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని భావిస్తున్నారు.ఈ విషయమై పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన 283 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరు మారుస్తూ తీసుకున్న తీర్మానంపై సంతకాలు చేయనున్నారు. ఈ తీర్మానం కాపీలను రేపు ఈసీకి అందించనున్నారు టీఆర్ఎస్ ప్రతినిధులు . బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం