Huzurabad Bypoll: ఈటల రాజేందర్, బీజేపీకి టీఆర్ఎస్ షాక్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

By telugu team  |  First Published Oct 12, 2021, 8:34 PM IST

హుజురాబాద్ ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. బీజేపీ, ఆ పార్టీ అభ్యర్థి ఈటలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్‌పై, టీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేసి లబ్దిపొందాలని చూడటమే కాకుండా, డబ్బు తీసుకోవాలని ఓటర్లను ఒత్తిడి చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. 
 


హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక కోసం bjp, trs పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నది. ఢీ అంటే ఢీ అన్నట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీకి, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. బీజేపీ, etela rajenderపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణలు ఇలా ఉన్నాయి. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరికించే కుట్ర చేశారని, టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ హుజురాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని ప్రయత్నం చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలతోనే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Latest Videos

undefined

టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్‌పై బీజేపీ నేతలు దాడి చేశారని, దీనిపైనా ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. bypoll జరగనున్న huzurabadలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నదని, కోడ్ అమల్లో ఉండగానే దాన్ని ఉల్లంఘిస్తూ రోడ్ షో నిర్వహించారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఫిర్యాదు చేసింది.

Also Read: Huzurabad Bypoll: ఈటల గెలవాలన్నదే మంత్రి హరీష్ కోరిక కూడా..: ఎమ్మెల్యే రఘునందన్ సంచలనం

టీఆర్ఎస్ డబ్బులు ఇస్తున్నదని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, అంతేకాదు, డబ్బులు తీసుకోవాలని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారని, వారిని తప్పుదారి పట్టిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీటితోపాటు టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేయడంపైనా ఫిర్యాదు చేశారు. అన్ని కేసుల్లోనూ సోమ భరత్ కుమార్ ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

click me!