
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వైపు చూస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారు అనంతరం క్షేత్రస్థాయి అంశాలపై దృష్టి పెట్టిన టిఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపి సహా తెలుగుదేశం,జనసమితి లాంటి పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టాయి.
Also Read:మున్సిపల్ ఎన్నికలు: కారును ఢీకొట్టేందుకు విపక్షాల వ్యూహలు
మూడు వేలకు పైగా వార్డులు ఉండడంతో ఆ వార్డులలో అధికార పక్షానికి దీటుగా అభ్యర్థిని రంగంలోకి దించడం విపక్ష పార్టీలకు సవాల్ గా మారింది. వార్డు స్థాయిలో ముఖ్యమైన నేతలు అధికార పార్టీ టికెట్లు ఆశిస్తున్నారు. విపక్ష పార్టీలకు కొన్నిచోట్ల అభ్యర్థులను ఎంపిక చేయడం ఇబ్బందిగా మారుతోందని తెలుస్తోంది.
Also Read:కారణమిదే:కేబినెట్‌లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?
దీంతో అధికార పార్టీలో టికెట్ దక్కని రెబల్ అభ్యర్థులపై ప్రతిపక్ష పార్టీలు దృష్టి సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. విపక్షాల వ్యూహాలపై అధికార పార్టీ అప్రమత్తంగా వ్యవహరించాలని నిరానాయించినట్లజ్ తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపిక ఈ ప్రక్రియను పూర్తి చేసినా చివరి నిమిషం లోనే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాలన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో వార్డు నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు టికెట్ దక్కించుకోవాలని టిఆర్ ఎస్ పార్టీ లో ప్రయత్నాలు చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. రిజర్వేషన్ల ఖరారు అనంతరం అభ్యర్థుల బలాబలాలు అన్ని రాజకీయ పార్టీలు బేరీజు వేసుకుంటూ బలమైన ఆభ్యర్థుల వేటలో ఉన్నాయి.