మోడీ వల్లే ఓడాను: కరీంనగర్‌లో ఓటమిపై వినోద్

By Siva KodatiFirst Published May 31, 2019, 11:04 AM IST
Highlights

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని నిరాశ పరిచిన అంశం నిజామాబాద్‌లో కవిత, కరీంనగర్‌లో వినోద్ కమార్ ఓడిపోవడం. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న ఈ రెండు స్థానాల్లో ఓటమి టీఆర్ఎస్ శ్రేణులను నీరుగార్చింది. 

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని నిరాశ పరిచిన అంశం నిజామాబాద్‌లో కవిత, కరీంనగర్‌లో వినోద్ కమార్ ఓడిపోవడం. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న ఈ రెండు స్థానాల్లో ఓటమి టీఆర్ఎస్ శ్రేణులను నీరుగార్చింది.

ముఖ్యంగా పార్లమెంట్‌లో ఆ పార్టీకి గొంతుగా వ్యవహరించడంతో పాటు ఢిల్లీలో వివిధ పనులను చెక్కబెట్టారు వినోద్ కుమార్. దీంతో కేసీఆర్‌కు సైతం ఇప్పుడు ఢిల్లీలో లాబీయింగ్ లేకుండా పోయింది.

ఇక తన ఓటమిపై స్పందించారు వినోద్ కుమార్. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అంతిమం అన్నారు.. ఈ ఎన్నికలు పెద్ద ఎత్తున తీర్పు చెప్పాయని.. దీనికి కారణం జాతీయవాదమే అన్నారు.

మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారిలో అత్యధికులు బీజేపీకి ఓటేశారని వినోద్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఒకరకమైన జాతీయ వాదం భావన నడుస్తోందన్నారు. ఎన్నికలకు ముందు పాకిస్తాన్‌లోని తీవ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడి బీజేపీకి అనుకూలంగా మారిందని వినోద్ తెలిపారు.

కరీంనగర్‌కు స్మార్ట్ సిటీని తీసుకొచ్చానని.. స్మార్ట్ సిటీ వల్ల నగరానికి ఐదేళ్లో వెయ్యి కోట్లు వస్తాయన్నారు. కరీంనగర్‌ను జాతీయ రహదారులతో అనుసంధానిస్తున్నామని.. తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతులు సాధించడానికి కృషి చేశానని వినోద్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 

click me!