హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

By narsimha lode  |  First Published May 31, 2019, 11:01 AM IST

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉండాలని టీడీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.


హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉండాలని టీడీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  హుజూర్ నగర్ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు. దీంతో హుజూర్ నగర్  అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సిన అవసరం నెలకొంది.

Latest Videos

undefined

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోదాడ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్‌ భార్య పద్మావతి పోటీ చేసి ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో కోదాడ , హుజూర్ నగర్ నుండి పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అసెంబ్లీలో అడుగుపెట్టారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పద్మావతి నిర్ణయం తీసుకొందని ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో ఖర్చు పెరగడం, పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఉత్తమ్ దంపతుల నుండి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
 

click me!