హైదరాబాద్‌లో దారుణం.... ఒకే టౌన్‌షిప్‌లో వంద కుక్కల దహనం

Published : Oct 09, 2018, 05:28 PM IST
హైదరాబాద్‌లో దారుణం.... ఒకే టౌన్‌షిప్‌లో వంద కుక్కల దహనం

సారాంశం

మూగజీవులపై ఓ టౌన్ షిప్ నిర్వహకులు అతి క్రూరంగా ప్రవర్తించిని ఘటన హైదరాబాద్ లో బైటపడింది.దాదాపు వందకు పైగా కుక్కలను ఓ టౌన్ షిప్ లో అతి దారుణంగా చంపేసి వాటిని రహస్యంగా కాల్చిచంపారు. ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ ఘట్కేసర్‌లోని సంస్కృతి టౌన్ షిప్ లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో టౌన్‌షిప్ నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టారు.ప్రత్యేకంగా కుక్కలు పట్టేవారితో దాదాపు 100కు పైగా కుక్కలను పట్టించారు. వీటికి విషం కలిపిన ఆహారాన్ని పెట్టి చంపారు. ఆ తర్వత వాటి కళేబరాలను టౌన్ షిప్ వెనుకవైపున్న ఖాళీ స్థలంలో రహస్యంగా దహనం చేశారు.

ఈ దారుణంపై  సమాచారం అందుకున్న ఓ మూగజీవుల సంరక్షణ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుక్కల కళేబరాలను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వీదికుక్కలను దహనం నిజమేనని....ఇలా వాటిని క్రూరంగా హతమార్చిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ఇలా మూగజీవులను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణానికి టౌన్ షిప్ ఛైర్మన్ తో పాటు సెక్రటరీ ముఖ్య కారకులంటూ వారు ఆరోపిస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు