టీఆర్ఎస్ ప్రచార సామాగ్రి పంపిణీ ఎలా జరిగిందంటే (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 9:09 PM IST
Highlights

తెలంగాణ లో అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలకు తెర లేసింది. ఈ ఎన్నికల్లో అన్ని విషయాల్లోను ముందుంటూ టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంచలనం సృష్టించాడు. ఈ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్టీ తరపున అభ్యర్థులకు ప్రచార సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే రెడీగా వున్న సామాగ్రిని నియోజకవర్గాలకు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి.
 
టీఆర్ఎస్ అభ్యర్థులందరు గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ప్రచారానికి అవసరమైన సామాగ్రిని అభ్యర్థులకు రాష్ట్ర పార్టీ సరఫరా చేసింది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన 105 శాసనసభ నియోజకవర్గాలకు సామాగ్రి తరలింపు పూర్తయింది. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రచార సామాగ్రిని నియోజకవర్గాల వారిగా డీసీఎం వ్యాన్ లో రవాణా చేశారు. ఈ ప్రచార సామాగ్రిలో వివిధ సైజుల్లో పార్టీ జెండాలు, కండువాలు, టోపిలు, బ్యాడ్జిలు, కారు గుర్తు , కేసీఆర్ చిత్రపటంతో కూడిన జెండాలు, బంటింగ్స్ ఉన్నాయి. సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, టీఎస్ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ప్రచార సామాగ్రిని పంపిణీని దగ్గరుండి చూసుకున్నారు.  

ప్రచార సామాగ్రి అందడంతో కేడర్ లో నూతనోత్సాహం కనపడుతుంది.ఇప్పటికే సాగుతున్న ప్రచారం వీటి రాకతో మరింత ఊపందుకుంటుందని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి, పార్టీ ప్రచార హోరు తెలిపడానికి ఈ సామాగ్రి ఉపయోగపడుతుందని అభ్యర్థులంటున్నారు. 90 శాతానికి పైగా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి ప్రత్యర్థులను కంగుతినిపించిన కేసీఆర్... ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారు కాకముందే మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేయాలని పార్టీ అభ్యర్థులకు సూచిస్తున్నారు.  

వీడియోలు

click me!