బిజెపి, టీఆర్ఎస్‌లతో ఈసీ కలిసిపోయింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 8:13 PM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. కేసీఆర్ లాంటి సీఎంను తాను ఇదివకెప్పుడూ చూడలేదని విమర్శించారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టి ఘోరీ కట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అనే ముసుగులో కేసీఆర్, కేటీఆర్ లు భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఉత్తమ్ ఆరోపించారు. ఇక బిజెపి,టీఆర్ఎస్ తో ఈసీ కలిసిపోయిందని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ సీఎం అయ్యాక దళితులకు మేలు జరుగుతుందని భావించామని... అయితే ఈ నాలుగేళ్లలో వారికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. దళితున్ని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తానని అధికారంలోకి వచ్చి తానే ముఖ్యమంత్రి అయ్యాడని గుర్తుచేశారు. అంతేకాకుండా మాల మాదిగలను మంత్రి పదివి కూడా ఇవ్వకుండా అవమానించారని మండిపడ్డారు. అందువల్ల ఇప్పుడు దళితులు నిశ్శబ్దంగా ఉంటే చరిత్ర క్షమించదని...ఎన్నికల ప్రచార సభల్లో దళిత సీఎం గురించి ప్రశ్నించాలని ఉత్తమ్ సూచించారు.

మాకు పిల్లలు లేరు కాబట్టి రాష్ట్ర ప్రజలనే తమ పిల్లలుగా భావించి సేవ చేస్తున్నామని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇంటిగో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. కానీ తాను మాత్రం తన ఇంట్లో ఐదు ఉద్యోగాలు తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. 

దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల వ్యవసాయ భూమి, ఒక సంవత్సరం పంట పెట్టుబడి హమీలను కేసీఆర్ విస్మరించారని ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కోట్ల మంది దళితులుంటే కేవలం 3 వేల మందికే భూమి ఇచ్చారని గుర్తు చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు కానీ తాను మాత్ర ప్రజల 500 కోట్ల డబ్బుతో విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నాడని విమర్శించాడు. పదే పదే దళితులను మోసం చేస్తున్న ఈ సీఎంకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఉత్తమ్ ప్రజలను కోరారు.  

click me!
Last Updated Sep 24, 2018, 8:31 PM IST
click me!